వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శానిటేషన్,పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది 4 రోజులుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెను విరమించారు.పెండింగ్ వేతనాలు,ఈఎస్ఐ,ఈపీఎఫ్,అపాయింట్మెంట్ లెటర్లు,గుర్తింపు కార్డుల సమస్యల పరిష్కారంపై ఏజెన్సీ భీమ్ సొసైటీ నిర్వాహకులు,యూనియన్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు సఫలమై ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించినట్లు ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం