వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి క్వార్టర్‌ను అక్రమంగా ఆక్రమించి,నిబంధనల ప్రకారం అధికారులు ఖాళీ చేయిస్తే.దానిని రాజకీయం చేస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మద్దె శంకర్‌పై జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు పైడిపల్లి నర్సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో పైడిపల్లి నర్సింగ్ మాట్లాడుతూ. గతంలో వివేక్ కుటుంబం శంకర్‌ను ఎంతో ఆదుకుందని, అలాంటి కుటుంబంపై ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేయడం శంకర్ దౌర్భాగ్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కార్యకర్తలు ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.మరోవైపు, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ స్పందిస్తూ.B-40క్వార్టర్‌లో మద్దె శంకర్ అనధికారికంగా ఉంటున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు.మూడుసార్లు నోటీసులు ఇచ్చి,కౌన్సిలింగ్ చేసినా ఖాళీ చేయకపోవడంతోనే నిబంధనల ప్రకారం పోలీసుల సమక్షంలో ఖాళీ చేయించామని స్పష్టం చేశారు. మంత్రి గారి క్యాంప్ కార్యాలయం కోసం B-1 క్వార్టర్ కేటాయించబడిందని,ఈ వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.చట్టబద్ధమైన చర్యలపై రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హెచ్చరించారు.
Admin
వాస్తవ గమ్యం