వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద BMW కారు యజమానిని ఆపి రూ. 5,000 బలవంతంగా డిమాండ్ చేసిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులుగా వేషధారణ చేసి వాహనదారులను బెదిరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. జూబ్లీహిల్స్ నుండి బోడుప్పల్ వరకు సుమారు 500 సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారుల సహకారంతో నిందితులను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు
Reporter
వాస్తవ గమ్యం